స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు బీసీలకు వ్యతిరేకంగా తీసిన జీవో 46 ను రద్దు చేయాలి
జీవో నంబర్ 46 పత్రాలను కాలబెట్టిన బీసీ జేఏసీ నాయకులు
— బీసీ మహిళా జేఏసీ కన్వీనర్ అడ్వకేట్ పేరాo అలేఖ్య
మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల బీసీ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తా అన్న కాంగ్రెస్ పార్టీ, మొన్నటి రోజున జీవో నెంబర్ 46 జారీ చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ ప్రజలను రాజకీయంగా,అనగతొక్కడానికి,బీసీలకు తీవ్రని అన్యాయాన్ని చేసిందని నిరసన గా మార్కెట్ చౌరస్తా, మంచిర్యాల్ నందు జీవో నంబర్ 46 పత్రాలను తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ మహిళా జేఏసీ జిల్లా కన్వీనర్ అలేఖ్య, బీసీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ వడ్డేపల్లి మనోహర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీ ప్రజలకి 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి, ఈ రోజున కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని కుంటి సాకులు చెబుతూ, కేంద్ర మీద పోరాటం కూడా చేయకుండా, రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 46 ఇస్తూ పాత రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడం అంటే బీసీ ప్రజలను వంచించి మోసం చేయడమే అని ఈ సందర్భంగా అన్నారు, మన మంచిర్యాల జిల్లాలో 300 స్థానాలు స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు ఉంటే కేవలం 9 స్థానాలు బీసీలకు కేటాయించడం జరిగింది. ఈ పద్ధతి న కేటాయించినది అన్నారు, పాత రిజర్వేషన్ల ప్రకారం అయినా 22% బీసీలకు 33 సీట్లు దక్కాలి కానీ 9 సీట్లే ఏ రకంగా బీసీ ప్రజలకు రిజర్వేషన్ కల్పించిందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. నేన్నల,మందమర్రి,మండలం భీమవరం,కోటపల్లి మండలంలో మొత్తంగానే ఒక్క సర్పంచ్ సీటు కూడా బీసీ ప్రజలకు కేటాయించకుండా, బీసీ ప్రజలను అవమానించారని, అక్కడ మా బీసీ ప్రజలు లేరా అని ప్రశ్నించడం జరిగింది,మొత్తానికి మొత్తంగా జనరల్ స్థానాలను పెట్టుతూ అగ్రవర్ణాల అధిపత్యాన్ని కొనసాగించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుందని అన్నారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా బీసీ ప్రజలు ఎక్కడికక్కడ ఉద్యమాలు చేయడం జరుగుతుందని, దానిలో భాగంగానే మంచిర్యాల జిల్లాలో బీసీ ప్రజలు రాజకీయంగా ఎదగాకుండా చేస్తున్న ఈ జీవో నెంబర్ 46 పత్రాలను దగ్ధం చేయడం జరిగింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీ ప్రజల ఆకాంక్షల కోరిక మేరకు ఈ జీవోను రద్దుచేసి, బీసీ ప్రజలకు దక్కాల్సిన 42% రిజర్వేషన్ను కల్పిస్తూ: స్థానిక సంస్థలు ఎన్నికలకు పోవాలని డిమాండ్ చేయడం జరిగింది, లేనిపక్షంలో బీసీ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించడం జరిగింది. కార్యక్రమంలో బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా నాయకుడు కొండిల్లా శ్రీనివాస్,తులా మధుసూదన్, అడ్వకేట్ నటేశ్వర్ కట్టుకోజు రమణ, యోగానంద, మడ్డి వేణుగోపాల్, బిసి జేఏసీ స్టూడెంట్ నాయకులు పూరీల్ల నితీష్, బీసీ నాయకులు బోయిన హరికృష్ణ, రమేష్ యాదవ్, తాజ్, ప్రవీణ్ శర్మ,విజయ్ తదితరులు పాల్గొన్నారు.





