ప్రాంతీయం

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ని అమలు చేయాలి

24 Views

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ని అమలు చేయాలి. అంబేద్కర్ విగ్రహానికి వినతి

మంచిర్యాల జిల్లా.

ఈరోజు సీసీసీ కార్నర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టిన అంశాలు అమలు చేయడం లో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ని నిరసిస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాం
మేనిఫెస్టో లోని అంశాలు

1) మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్ట బద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతి బాపూలే పేరుతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని
2) ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెంటేనేన్స్ కాంట్రాక్టు లలో బీసీ లకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని
3) బీసీ కార్పొరేషన్ ఫెడరేషన్ కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ మరియు 10 లక్షల ఆర్ధిక సహాయం
4) అన్నీ జిల్లా కేంద్రాలలో 50 కోట్లతో కన్వెన్షన్ హాల్ స్టడీ సర్కిల్ లైబ్రరీ లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు నిర్మిస్తామని
5) జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతామమీ
6) ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని
7) 5 సంవత్సరాలలో బీసీ ల సంక్షేమానికి లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని
8) విద్యార్థుల ఉన్నత విద్యకు ఎలాంటి పూచికత్తు లేని 10 లక్షల ఆర్ధిక సహాయం చేస్తామని

అధికారం చేపట్టి 2 సంవత్సరాల కాలం అవుతున్న ఏ ఒక్క డిమాండ్ పరిష్కరించిన పాపాన పోలేదు ఇప్పటికైనా ఎన్నికల మేనిఫెస్టో ని అమలు చేయాలని డిమాండ్ చేస్తునాం లేని పక్షం లో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం.

ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, నాయకులు : శాఖపురి భీంసేన్ వేముల కిరణ్, అంకం సతీష్, చంద్రగిరి చంద్రమౌళి, చెలిమల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *