శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులుగా టి ఎం డి లక్ష్మణ్
సిద్దిపేట జిల్లా, గజ్వేల్ నవంబర్ 24
సిద్దిపేట జిల్లా గజ్వేల్ గజ్వేల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ శాశ్వత సభ్యుల సమావేశం సోమవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి,కోశాధికారి ఎన్నికలు ఏకగ్రీవం చేశారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం కమిటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన టి ఎం డి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, కోశాధికారి కిషన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి గా మాకు అవకాశం కల్పించిన ఆలయ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శేషం శ్రీనివాస చార్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, గాడిపల్లి భాస్కర్, అయిత సత్యనారాయణ, శ్రీనివాస్,మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు కలియుగ దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధిలో ప్రత్యేక భూమిక పోషించాలని అన్నారు, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.





