ప్రాంతీయం

ప్రజా భద్రతే లక్ష్యం, విజబుల్ పోలీసింగ్‌తో ప్రజలకు భరోసా

18 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

ప్రజా భద్రతే లక్ష్యం, విజబుల్ పోలీసింగ్‌తో ప్రజలకు భరోసా: రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్.

ప్రజా భద్రతే లక్ష్యంగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ విజబుల్ పోలీసింగ్‌తో అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు భరోసా కల్పించాలి అని రామగుండం పోలీస్‌ కమిషనర్‌
పోలీస్‌ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్‌ కమీషనరేట్ మంచిర్యాల జోన్ దండేపల్లి పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్‌ స్టేషన్‌ చేరుకున్న పోలీస్‌ కమిషనర్‌కు పోలీస్ అధికారులు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ సిబ్బంది తో మాట్లాడి వారి విధులు, పనితీరు, సమస్లు అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్‌ స్టేషన్‌ రిసెప్షన్‌, ఇతర విభాగాల పనీతీరును సంబంధిత పోలీస్‌ సిబ్బందిని శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో భాగంగా పోలీస్‌ స్టేషన్‌ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు సంబంధించి పోలీస్‌ కమిషనర్‌ క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అలాగే స్టేషన్‌ పరిధి గ్రామాలలో జరిగే నేరాల గురించి, సమస్యల గురించి ప్రజల జీవన విధానం గురించి, ఇక్కడ పరిస్థితిల గురించి, ముఖ్యమైన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రౌడీ షీటర్లు, అనుమానితులు, కేడీ, డిసిలు, మిస్సింగ్‌, ప్రాపర్టీ నేరాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ  పోలీసింగ్, పెట్రోలింగ్ నిర్వహించాలి గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకమై ప్రజల లో నమ్మకాన్ని కలిగించడంతో పాటు, పోలీస్‌ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలి. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతోపాటు, మర్యాదపూర్వకంగా వారి సమస్య వినాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని సీపీ అన్నారు. ప్రధాన రహదారి పై, గ్రామాలలో సిసి కెమెరాల వివరాలు, వాటి ఏర్పాటు, పనితీరు, వాటి ఆవశ్యకత ప్రజలకు వివరించి ఏర్పాటు కృషి చేయాలనీ సూచించారు. రోడ్డు ప్రమాదాలు నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ తనిఖీల్లో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్., ఏసీపీ ప్రకాష్, లక్షేట్టిపేట్ సీఐ రమణ మూర్తి, దండేపల్లి ఎస్‌.ఐ తైసీనుద్దీన్ పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *