పునరావాసం, వైద్యం ,ఉద్యోగాలు, కావాలని బిఎస్పీ డిమాండ్.
మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో ఓసి ఫేస్ టు ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు సింగరేణి మరియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారుఓసి వల్ల నష్టపోతున్న ప్రజలకు ఆర్ అండ్ ఆర్ ద్వారా వారికి పునరావాసం కల్పించాలని పర్యావరణ కాలుష్యాన్ని నివారించాలని ఓసి వల్ల ఆనారోగ్య పాలైన ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలని స్థానికులకు 90 కాంట్రాక్ట్ బేసిక్ కింద ఉద్యోగాలు కల్పించాలని ఇండ్ల స్థలాలు ఇచ్చేంతవరకు సింగరేణి కోటర్స్ ని ప్రజలకు ఇవ్వాలని ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్రప్రసాద్ మరియు బొల్లి నరేష్ ప్రజలు నాయకులు పాల్గొన్నారు.





