*పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు*
మంగళవారం రోజున భీమిని మండల కేంద్రంలో భీమిని ,లక్ష్మీపూర్, గ్రామాలలో ఉపాధి హామీ కూలీలకు గ్రామ ప్రజలకు పెద్దపెల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన గౌరవ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ .
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ కూలీలకు రోజుకు 400 రూ. పెంచుతుందని ఎమ్మెల్యే అన్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. గడ్డం వంశీకృష్ణ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు* ఇందిరమ్మ రాజ్యం రావాలంటే హస్తం గుర్తుకు ఓటు వెయ్యాలని అభ్యర్థించారు. నేను మినిస్టర్ గా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం అప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఉపాధి హామీ పథకం పెట్టడం జరిగింది..
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు గ్రామస్తులు ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.





