ప్రాంతీయం

మాలలకు రిజర్వేషన్ శాతం పెంచి రోస్టర్ పాయింట్ తగ్గించాలే అని మంత్రి కి వినతి పత్రం

27 Views

మాలలకు రిజర్వేషన్ శాతం పెంచి రోస్టర్ పాయింట్ తగ్గించాలే అని మంత్రి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది

మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మ శ్రీనివాస్

మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి

హంస ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు బండారు దేవేందర్

సిద్దిపేట జిల్లా గజ్వేల్, నవంబర్ 19

మాల మహానాడు ఆధ్వర్యంలో గజ్వేల్ లో మాల మాల అనుబంధ 26 కులాల కు తీవ్ర అన్యాయం జరిగిందని జాతీయ మాలమానాడు తుమ్మ శ్రీనివాస్ , దళిత సంఘాల ఐక్య కార్య చరణ సమితి రాష్ట్ర కార్యదర్శి చిప్పల యాదగిరి,మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి యువజన కార్యదర్శి నీరుడి స్వామి , హంస ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు బండారు దేవేందర్ ,మాల జెఎసి రాష్ట్ర సెక్రటరీ కృపానందం , మాట్లాడుతూ మాలల రోషర్ ప్లాంట్ తగ్గించాలని గడ్డము వివేక్ కి తెలంగాణ  రాష్ట్ర లేబర్ అండ్ మైనింగ్ శాఖ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది మంత్రి తో మాట్లాడుతూ ఏమనగా 2025 ఏప్రిల్ 14న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( ఎస్సీ ) రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చింది. మేము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటాం. కాని సామాజిక న్యాయానికి శాస్త్రీయత ఉండాలని కూడా మేము భావిస్తున్నాం. ఈ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ను సరిగ్గా పాటించలేదని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. సుప్రీంకోర్టు ఆర్థిక వెనుకబాటు తనం ప్రకారం రిజర్వేషన్లను వర్గీకరించుకోవచ్చుని సూచించింది. కాని రాష్ట్ర ప్రభుత్వం జనాభా దామాషా ప్రకారం, కుల సమూహాల ప్రకారం రిజర్వేషన్లను వర్గీకరించి చట్టాన్ని తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన షమీమ్ అక్తర్ రిపోర్టు ప్రకారం మాల, మాల అనుబంధం కులాల ఉద్యోగుల కంటే మాదిగలే (మొదటి గ్రప్ వాళ్లు తప్ప) అధిక సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారని, అధిక సంఖ్యలో సంక్షేమంలో లబ్ధి పొందారని గుర్తించింది. కాని రాష్ట్ర ప్రభుత్వం మాల, అనుబంధ(26 కులాలు) కులాలను మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించింది. ఈ కులాలకు( గ్రూప్ త్రీ )ని కేటాయించింది. ప్రస్తుత రోస్టర్ పాయింట్ విధానం వలన మాల, అనుబంధ(26 కులాలు) కులాలకు తీవ్ర అన్యాయం జరిగింది. భవిష్యత్లో మరింత అన్యాయం జరుగబోతున్నదనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రతి ఉద్యోగ నియామకంలో, ప్రమోషన్ పొందే క్రమంలో ప్రతి కులానికి కనీస అవకాశం రావాలని సూచించింది. కాని ఇటీవల శాతవాహన యూనివర్సిటీలో పార్టెం టీచింగ్లో 35 పోస్టులు కేటాయిస్తే మాల, మాల అనుబంధ(26 కులాలు) కులాలకు ఒక పోస్టు కూడా లేదు. అలాగే డెంటల్ డిపార్ట్ మెంట్ లో 48 పోస్టులు కేటాయిస్తే వీరికి కులాలకు ఒక పోస్టు వచ్చింది. మొదటి 20 రోస్టర్ పాయింట్లను పరిశీలిస్తే మాల, మాల అనుబంధ కులాలకు ఒక రోస్తర్ పాయింట్ కూడా లేదు. మా వినతిని స్వీకరించి మా సమస్యను పరిశీలిస్తారని. మనవి చేస్తున్నాం. ఇట్టి కార్యక్రమంల లో మాల మహానాడు జేయసి జిల్లా నాయకులు నాయకులు శివకుమార్, గాలింక శ్రీనివాస్, నరేష్ ,సింగాటంచంద్రం, వేణు, కరుణాకర్, ఎల్లం, తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *