ప్రజలకు పారదర్శకంగా పోలీస్ సేవలను అందించాలనే లక్ష్యంతో ‘ఆన్‌సైట్ ( ఎఫ్ ఐ ఆర్) విధానాన్ని అమలు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్,తెలిపారు..
సిద్దిపేట్, ఏప్రిల్ 4, తెలుగు న్యూస్ 24/7
ప్రజలకు మరింత చేరువగా, వేగవంతంగా మరియు పారదర్శకంగా పోలీస్ సేవలను అందించాలనే లక్ష్యంతో ‘ఆన్‌సైట్ ( ఎఫ్ ఐ ఆర్) విధానాన్ని అమలు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్., తెలిపారు.ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ.. సిద్దిపేట పోలీసు ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు “ఆన్‌సైట్ (ఎఫ్ ఐ ఆర్) (ఆన్ -సైట్ ఎఫ్ ఐ ఆర్ / డోర్ స్టెప్ ఎఫ్ ఐ ఆర్ )” విధానాన్ని అమలు చేస్తోందని బాధితులు హత్య ప్రయత్నం ,అత్యాచార ప్రయత్నం ,దోపిడీ / చోరీ, మహిళలు చిన్నారులపై నేరాలు, రోడ్డు ప్రమాదాలు, ఎస్సీ ఎస్టీ, బాల్యవివాహాలు, ర్యాగింగ్ వంటి నేరాల్లో బాధితులు పోలీస్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండా, ఎక్కడ ఉంటే అక్కడ బాధితుల నివాసం, హాస్పిటల్, రక్షణ ప్రదేశం, సంఘటన చోటుచేసుకున్న ప్రదేశంలోనే పోలీసు అధికారులు (ఎఫ్ ఐ ఆర్ ). సంఘటన స్థలంలోనే (ఎఫ్ ఐ ఆర్ ) నమోదు చేయడం ద్వారా ఆధారాలు సేకరణ వేగంగా నిందితులను త్వరగా పట్టుకునే అవకాశం ఉంటుందిని ఈ సేవ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు, మహిళలకు, వృద్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీని ద్వారా సమయం ఆదా అవడంతో పాటు, బాధితులకు తక్షణ సహాయం అందుతుందని, ప్రజలు ఎలాంటి సంఘటన జరిగినా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని ‘ఆన్‌సైట్ (ఎఫ్ ఐ ఆర్ )’ ద్వారా మీ వద్దకే వచ్చి సేవలు అందిస్తామని ఇది ప్రజల నమ్మకాన్ని పెంచే దిశగా తీసుకున్న కీలక నిర్ణయం. ప్రతి ఒక్కరూ ఈ సేవను వినియోగించుకొని న్యాయం పొందాలని, సిద్దిపేట పోలీసు ప్రజల భద్రత, సౌకర్యమే లక్ష్యంగా మరిన్ని వినూత్న సేవలను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని సిపి రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ తెలిపారు.





