ప్రజలకు ప్రభుత్వానికి వారదులు జర్నలిస్టులు — కమ్మరి శ్రీను
టీజేయు గజ్వేల్ అధ్యక్షుడు గుడాల శేఖర్ గుప్తకు ఘన సన్మానం
సిద్దిపేట జిల్లా గజ్వేల్, నవంబర్ 16
జాతీయ జర్నలిస్ట్ దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఆదివారం బిజెపి సీనియర్ నాయకులు కమ్మరి శ్రీను ఆధ్వర్యంలో జర్నలిస్టులకు చిరు సన్మానం చేశారు, అందులో భాగంగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ గజ్వేల్ నియోజక వర్గం అధ్యక్షుడు గుడాల శేఖర్ గుప్తకు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపిన కమ్మరి శ్రీను మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారదులు జర్నలిస్టులు అని చిరు సన్మానం చేయడం జరిగిందని అన్నారు, ఈ కార్యక్రమంలో నాయిని సందీప్, బారు అరవింద్,పబ్బ శ్రీనివాస్, ఐల వేణు, నరేందర్ తదితరులు ఉన్నారు





