ప్రాంతీయం

ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లలో మాలలకు అన్యాయం

371 Views

ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లలో మాలలకు అన్యాయం

మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి

సిద్దిపేట జిల్లా గజ్వేల్, నవంబర్ 16

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసిన తర్వాత జరిగిన అన్యాయం మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి మాట్లాడుతూ ఆరు నెలలుగా అన్ని నోటిఫికేషన్లో సొంత కులం మాలలకు జరుగుతున్న అన్యాయం పై నోరు విప్పని, మాలల తరఫున ప్రతినిధులు: స్పీకర్, డిప్యూటీ సీఎం,మంత్రి, ఇద్దరు ఎంపీలు, 9మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల నాయకులారా…మీరు మాలలకు జరుగుతున్న అన్యాయం రోస్టర్ విధానాన్ని సవరించి రిజర్వేషన్లు రెండు శాతం పెంచాలని మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చెయ్యాలని డిమాండ్ చేస్తూ వర్గీకరణ జరిగేటప్పుడు నోరు విప్పకపోవడం వల్ల మన జాతికి తీవ్ర అన్యాయం జరిగింది. మాల విద్యార్థి, ఉపాధి రంగాల్లో, నిరుద్యోగులకు ఉద్యోగ రంగంలో,ఉద్యోగస్తులకు ప్రమోషన్లు అన్యాయం,జరుగుతుంది. నిన్న వచ్చిన తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ లో గ్రూప్ త్రీ లో ఉన్న మాల,25 కులాలకు జీరో(0 )పోస్ట్ లు మాలలకు గుండు సున్న, ఆరు నెలలుగా అన్ని నోటిఫికేషన్లు అన్యాయం జరుగుతున్న తెలంగాణ మాల మేధావులు, అన్ని పార్టీలలో ఉన్న అనుబంధం ఉన్న మాల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, టీం ఉద్యోగస్తులు, కొత్తగా పెట్టిన రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘాలు.మీ భవిష్యత్తు తరాల కోసం , ఆలోచించడం లేదు, అన్యాయంపై కనీసం చర్చ కూడా చేయలేదు, ఇప్పుడైనా చర్చించండి, ఆలోచించండి, కులం తరఫున మాట్లాడండి, మీరు వెళ్లే రాజకీయ నాయకులతో విషయాన్ని అర్థం చేయించండి, దీనిపైన ఉద్యమించే వారికి గైడ్ చేయండి, మనకు జరిగిన, జరుగుతున్న అన్యాయంపై ఉద్యమించే సమయం ఆసన్నమైంది,  బి.ఆర్ అంబేద్కర్ చెప్పినట్లు: “హక్కులకై బిక్ష మెత్తకండి పోరాడి సాధించు కుందామని చెప్పారు.. మీరు మాలల ప్రజల తరఫున ఉద్యమిస్తారో… మీ వ్యక్తిగత ప్రమోషన్ల కోసం, ట్రాన్స్ఫర్ ల కోసం,కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటారో…మీ భవిష్యత్ తరాల కోసం..తేల్చుకోవాల్సిందిగా కోరుతున్నాం.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ విషయంలో నాటకాలు ఆడుతున్న ఈ దేశంలో ఎక్కడా లేని వర్గీకరణ తెలంగాణలోనే ఎందుకు ఇంప్లిమెంట్ చేసిరని ప్రభుత్వాలను సూటిగా ప్రశ్నిస్తున్నాం అని స్వామి తెలియజేశారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *