రామగుండం పోలీస్ కమిషనరేట్
శభాష్ దేవాపూర్ పోలీస్ అపస్మారక స్థితి లో ఉన్న వ్యక్తి ప్రాణం కాపాడిన ఎస్ ఐ దేవాపూర్ సిబ్బంది
మంచిర్యాల జిల్లా.
ఈరోజు ఉదయం సుమారు 8:00 గంటలకు కాల్వల తిరుపతి ఆనే వ్యక్తి తన బార్యతో గొడవపడి నేను సచ్చిపోత అనుకుంటూ ఇంటి నుండి వెళ్లిపోయి చాలా సమయం వరకు ఇంటికి రాకపోయేసరికి తన కుటుంబ సభ్యులు అతని గురించి చుట్టుపక్కల అంతటా వెతికిన కనిపించక పోయేసరికి అతని పెద్ద కొడుకు తన తండ్రి కనిపిస్తాలేడు అని పోలీస్ స్టేషన్ కి వచ్చి పిర్యాదు చేయగా దేవాపూర్ ఎస్ఐ గంగారం వెంటనే స్పందించి సాంకేతిక పరిజ్ఞానంతో ఒక గంట సమయంలోనే అతడు దేవాపూర్ లో సల్పల వాగు సమీపం లోని అటవీ ప్రాంతంలో ఉన్నాడు అని గుర్తించి వెంటనే తన సిబ్బందిని తీసుకొని అక్కడికి వెళ్ళగా తిరుపతి అటవీ ప్రాంతం లో ఒక చెట్టు కింద ఆపస్మారక స్థితి లో పడి ఉండడం గమనించి వెంటనే స్పందించి తిరుపతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించినారు.





