యువత క్రీడల్లో రాణించి జాతీయ స్థాయి వరకు వెళ్లి సత్త చాటాలి- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి.
మంచిర్యాల జిల్లా.
బీజేపీ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ గర్మిళ్ళ జోనల్ అధ్యక్షులు అమీరిశెట్టి రాజ్ కుమార్ తండ్రి స్మారకార్థం మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గత 7 రోజులగా నిర్వహిస్తున్న అమీరిశెట్టి భూమయ్య ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొనడం జరిగింది. జనసేన టీమ్ మరియు సాయి కుమార్ 11 మధ్య జరిగిన లో జనసేన టీమ్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా రఘునాథ్ జనసేన టీమ్ కు విన్నర్ ట్రోఫీ మరియు 30 వేల రూపాయలు క్యాష్ ప్రైజ్ అందజేశారు మరియు రన్నర్ జట్టు సాయి కుమార్ 11 టీమ్ కు రన్నర్ ట్రోఫీ 15 వేల రూపాయల క్యాష్ ప్రైజ్ అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అమిరిశెట్టి రాజ్ కుమార్, అమిరిశెట్టి మల్లేష్, గాజుల ముఖేష్ గౌడ్, ఆవుల సాయి కుమార్, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, జోగుల శ్రీదేవి, బెల్లంకొండ మురళి, కుర్రే చక్రవర్తి, గడ్డం స్వామి రెడ్డి, రాకేష్ రెన్వ మరియు తదితరులు పాల్గొన్నారు.





