ప్రాంతీయం

రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం కార్యక్రమం

24 Views

రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో సేవలో బంగారు అక్షరాల దంపతులు దోమల శ్యామల బండారి శ్రీనివాస్.

రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం కార్యక్రమం.

మంచిర్యాల జిల్లా.

మనిషి జీవితంలో సేవ అనేది మాటలకే పరిమితం కాకుండా,చర్యల ద్వారా ప్రతిబింబించాలి.ఇదే నిజమైన మానవత్వానికి నిదర్శనంగా,ఈ రోజు మంచిర్యాల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో లక్సేట్టిపేట నుండి స్వచ్ఛందంగా వచ్చి
ప్రభుత్వ ఉపాధ్యాయులైన శ్యామల& శ్రీనివాస్ దంపతులు,మనస్పూర్తిగా రక్తదానం చేసి సమాజానికి ఒక గొప్ప సందేశం అందించారు.

సమాజానికి జ్ఞానం పంచే గురువులు
ఇప్పుడు ప్రాణదాతలుగా కూడా నిలిచారు.
వారి సేవ భావం విద్యార్థులకు మాత్రమే కాదు,
ప్రతి కుటుంబానికి, ప్రతి యువతకు ఒక అద్భుతమైన ఆదర్శం కావాలని వారి కోరిక ఈ దంపతులు ఇప్పటివరకు ఐదుసార్లు రక్తదానం చేసి,తమ వివాహ సందర్భంగా కూడా రక్తదానం చేయాలి అనే శుభసంకల్పంతో ముందుకు రావడం,మానవతా పరంగా ఎంతో ప్రశంసనీయం. రహీమ్ బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు అబ్దుల్ రహీమ్ మాట్లాడుతూ—“ఇలాంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు సేవలో ముందుండటం సమాజానికి గొప్ప ప్రేరణ. ముఖ్యంగ తలసేమియా మరియు సికిల్ సెల్ వ్యాధిగ్రస్త చిన్నారులు ప్రతి నెలా రక్తంపై ఆధారపడుతుంటారు. ఇటువంటి సమయంలో శ్యామల & శ్రీనివాస్ దంపతుల వంటి సేవాభావం ఉన్న వ్యక్తులు ముందుకు రావడం వల్ల ఎన్నో ప్రాణాలు కాపాడబడతాయి’’ అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, మరియు రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ సభ్యులు దంపతుల సేవను హర్షించారు.
రక్తదానం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు, సమాజానికి కలిగే మేలు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.చివరగా, రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ తరఫున,ప్రభుత్వ ఉపాధ్యాయులైన శ్యామల & శ్రీనివాస్ దంపతులకు
హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ
“రక్తదానం మానవతా సేవ; ప్రతి ఒక్కరూ చేయాల్సిన మహాదానం”అని పేర్కొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *