ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో స్కేర్ ఫీట్స్ తక్కువ ఉన్న పర్మిషన్ ఇవ్వాలని కోరడం జరిగింది
నవంబర్ 15
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య,కి వినతి పత్రం అందజేయడం జరిగింది.అనంతరము కన్జ్యూమర్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్, రాష్ట్ర కమిటి అధ్యక్షుడు వనం రమేష్, మరియు బి ఎల్ పి పార్టీ రాష్ట్ర నాయకులు దబ్బెట ఆనంద్, మాట్లాడుతూ.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చెపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో 400 నుండి 600 స్క్వేర్ ఫీట్ల నిబంధనతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలని ఉన్నది. కానీ కొంత మంది బడుగు,బలహీన వర్గాలు దళిత, గిరిజనులు నిబంధన ప్రకారం కంటే తక్కువ స్థలం ఉన్న కూడా ఇల్లు నిర్మించుకోవడానికి వీల్లేదు కాబట్టి ఫ్లాటు స్క్వేర్ ఫీట్ల విషయంలో కొంచెం రెండు మూడు గజాలు తక్కువ ఫ్లాట్ ఉన్నా కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేటట్లుగా ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా పేదలకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. తెలంగాణ ఎస్సి , ఎస్టి కమిషన్ చైర్మన్ సానుకూలంగా స్పందించి పై విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తన్నారు.





