తోగుట్గ:ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఫండ్స్ నుండి సీసీ రోడ్డు మరమ్మత్తులకు నిధులు కేటాయించడం హర్షదాయకం అని ఎంపీటీసీ మాష్టి సుమలతలున్నారు, ఎంపీ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు,
ఎంపీ మార్గదర్శకంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు ఇట్టి నిధులను వినియోగించుకుని తమ కాలనీ ల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని ఎంపీ పిలుపునివ్వడం హర్షించదగిన పరిణామం, మరోసారి ఎంపీ ధన్యవాదాలు .సీసీ రోడ్ల పనుల నిర్మాణ ప్రారంభించే కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మెట్టు వరలక్ష్మి, వార్డు నెంబర్ గుమ్మడిదల శ్రీనివాస్, గ్రామ పార్టీ అధ్యక్షుడు బోయిని శ్రీనివాస్, బి.ఆర్య.స్ నాయకులు కొల కనకయ్య, మాష్టి కనకయ్య , దేవరాయ యాదగిరి తదితరులు పాల్గొన్నారు
