హాలో బీసీ..చలో కామారెడ్డి
సిద్దిపేట జిల్లా,గజ్వేల్, నవంబర్ 14
42% బీసీ రిజర్వే సిద్దిపేట జిల్లా గజ్వేల్ నవంబర్ 14షన్ల సాధన సమితి మరియు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీల ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే బీసీ ఆక్రోశ సభ కరపత్ర ఆవిష్కరణ గజ్వేల్ పట్టణ కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు కర్రోళ్ల రవిబాబు, బీసీ సంఘాల నాయకులు కానుగుల రమనకర్ శాలివాహన,కెతోజి వినోద్ చారి, పెంటకాడి సుధాకర్ రజక,( ఎం.ఆర్.పి.ఎస్) రాష్ట్ర నాయకులు పొన్నాల కుమార్,దళిత సంఘాల ఐకాస రాష్ట్ర కార్యదర్శి చిప్పల యాదగిరి, మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి, మాట్లాడుతూ , ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, కన్వీనర్ డా. విశారదన్ మహారాజ్, బీసీ ఫ్రంట్ నాయకులు
బాలరాజు గౌడ్ నాయకత్వములో నడుస్తున్న బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటానికి అందరూ కలిసి రావాలని అని 42 శాతం బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించి భారత రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చే ప్రక్రియలో నిజాయితీ లేకుండా తప్పుడు జీవో ల ద్వారా బీసీ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా మరియు బీసీ రిజర్వేషన్ల బిల్లును భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టం అని నిర్లక్ష్యంగా ప్రకటించిన కేంద్ర బిజెపి ప్రభుత్వ వైఖరికి నిరసనగా మరియు ఈ రెండు పార్టీల మాయా క్రీడలను చూస్తూ మౌనంగా ఉండి బీసీలను నిర్లక్ష్యం చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నవంబర్ 15వ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రంలో రెండున్నర కోట్ల మంది బీసీ ప్రజల ఆక్రోష సభని నిర్వహించడం జరుగుతున్నది.అనంతరం ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీల సమస్య ఈ దేశ ప్రధాన సమస్య అనే నిజం తెలిసి కూడా అగ్ర కుల పాలక వర్గాలు ఆ విషయాన్ని పట్టించుకోకుండా బీసీలను నిరంతరం మభ్యపెడుతూ, మాయ చేస్తూ తమ ఓట్ల రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయి. ఈ ఆక్రోశ సభ కి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ కుల సంఘాల నాయకులు, మేధావులు, విద్యావంతులు అధిక సంఖ్యలో తరలి వచ్చి సభని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో,దళిత సంఘాల ఐకాస జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకటేష్, డి ఎస్ యు, నాయకులు కసార్ల యాదగిరి, కోట మహేందర్,బండి నరేష్, పరశురాములు,నర్సింలు, నర్సింగరావు, కొప్పు రవి,తదితరులు





