ప్రాంతీయం

పుల్లూరులో ముగ్గుల పోటీలతో సంక్రాంతి శుభారంభం

25 Views

పుల్లూరులో ముగ్గుల పోటీలతో సంక్రాంతి శుభారంభం

కార్యక్రమంలో పాల్గొన్న వంగ రాజేశ్వర్ రెడ్డి

సిద్దిపేట జిల్లా, జనవరి 13, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు, నూతన గ్రామ పంచాయతీ పాలక వర్గానికి సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వంగ రాజేశ్వర్ రెడ్డి,ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. పోటీలో ప్రథమ బహుమతి సాధించిన ఆర్. వెంకటలక్ష్మికి ₹3,000 నగదు, ద్వితీయ బహుమతి గెలుచుకున్న ఆర్. విమలకు ₹1,500 నగదు బహుమతులు అందజేశారు. అలాగే మూడవ, నాల్గవ, ఐదవ బహుమతులను కూడా విజేతలకు వంగ రాజేశ్వర్ రెడ్డి , సర్పంచ్ కుంచం లత వెంకట్ యాదవ్,ఉపసర్పంచ్ ఒగ్గు రాజేష్, చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు,మహిళలు,యువత పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *