మద్యం సేవించి వాహనాలను నడిపితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని రాయపోల్ ఎస్ఐ మానస అన్నారు. రాయపోల్ మండల పరిధిలోని తిమ్మక్ పల్లి గ్రామ సమీపంలో వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలన్నారు. కారు నడిపే వాహనదారులు సీట్ బెల్ట్, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే పదివేల జరిమానా లేదా జైలుకు పంపించడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగానే వాహనాల తనిఖీలలో చిన్నమాసాన్ పల్లి గ్రామనికి చెందిన సోక్కం ప్రశాంత్ అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడిపారు. అతడిని డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రీత్ ఏనలైజర్ పరీక్షించగా మద్యం సేవించినట్టు రిపోర్టు వచ్చింది. ప్రశాంత్ పై కేసు నమోదు చేసి గజ్వేల్ కోర్టు మేజిస్ట్రేట్ స్వాతి ముందు హాజరు పరచగా, ప్రశాంత్ కు 3 రోజుల జైలు శిక్ష కరారు చేయడమైందని ఎస్ఐ మానస తెలిపారు.





