తెలంగాణ రాజ్యాధికార పార్టీ లో చేరిన అడ్వకేట్
మంచిర్యాల జిల్లా.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న హై కోర్ట్ అడ్వకేట్ చుంచు లక్ష్మీ నారాయణ, పార్టీ సిద్ధాంతాలు, తీన్మార్ మల్లన్న పోరాట స్ఫూర్తికి ఆకర్షితులై, బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని , బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆత్మాభిమానంకొరకై ఏర్పడిన పార్టీలో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుని ఈరోజు పార్టీ లో చేరారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మీలాంటి అడ్వకేట్లు , మేధావులు, విద్యావంతులు మిమ్మల్ని స్పూర్తిగా తీసుకుని స్వచ్ఛందంగా పార్టీలో చేరాలని కోరారు. కలిసికట్టుగా ఉంటేనే మన రాజ్యాధికారం మనకు దక్కుతుందని, ఎవరెంతో వారికంత ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. వచ్చేది బీసీల రాజ్యమే అని, ఇప్పటికైన పరాయి పార్టీ జెండాలను పక్కనబెట్టి, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరి కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు. ప్రజల పక్షాన కొట్లాడే, పోరాడే నాయకులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్వాగతం పలుకుతుంది స్పష్టం చేశారు.





