ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో జాతీయ టీకాల కార్యక్రమం.
మంచిర్యాల జిల్లా.
ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశానుసారము అరుణక్కానగర్ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో జాతీయ టీకాల కార్యక్రమంలో అసంక్రమణ వ్యాధులు పరీక్షలు మరియు జాతీయ కుష్టు వ్యాధి కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగినది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో డాక్టర్ మమత, వజ్ర ఆరోగ్య కార్యకర్త సునీత, లలిత, సుధా, ఆశా కార్యకర్తలు మరియు లింగారెడ్డి, సి హెచ్ ఓ రాఘవయ్య డిపిఎమ్ఓ బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఈరోజు ఈ ఉపకేంద్రములో ఐదుగురు పిల్లలకు టీకాలు ఇవ్వడం మరియు అసంక్రమణ వ్యాధుల పైన పరీక్షలు చేయడము జరిగినది ముఖ్యంగా వాతావరణ మార్పులతో సీజనల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్త పడాలని కీటక జనిత వ్యాధులు మరియు చిన్న చిన్న చిరు వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్త పడాలని ముఖ్యంగా వృద్ధులు గర్భవతులు చిన్నపిల్లలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరినారు. వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత వ్యాధులను దూరం చేయవచ్చును అసంక్రమణ వ్యాధుల్లో భాగంగా 30 సంవత్సరాల పైబడిన వారందరికీ పరీక్షలు చేసి మందులు అందించాలని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరినారు జీవనశైలి మార్పులలో చాలామందికి అసంక్రమణ వ్యాధులు వస్తున్నందున మార్చుకోవాలని అదేవిధంగా మంచి అలవాట్లు చేసుకోవాలని కోరినారు.





