అంబేద్కర్ స్ఫూర్తితో సడక్ బందును జయప్రదం చేయాలి..
జేఏసీ గ్రామ కన్వీనర్ మాజీ సర్పంచ్ కొంగరి వెంకటస్వామి..
. ముస్త్యాల సెప్టెంబర్ 24:
సిద్దిపేట జిల్లా చేర్యాల ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమంలో భాగంగా *సెప్టెంబర్ 29 శుక్రవారం రోజున* జేఏసీ ఆధ్వర్యంలో జరుగనున్న సడక్ బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ముస్త్యాల గ్రామ జేఏసీ కన్వీనర్ మాజీ సర్పంచ్ కొంగరి వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఆదివారం రోజున ముస్త్యాల గ్రామ బస్టాండు ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహానికి గ్రామ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలోపూలమాలవేసిన అనంతరం కొంగరి వెంకటస్వామి మాట్లాడుతూ ఎంతో చరిత్ర గల చేర్యాల ప్రాంతా న్ని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేర్యాల రోజురోజుకు అభివృద్ధి చెందాలి తప్ప ఎలాంటి అభివృద్ధి చెందకుండా రోజు రోజుకు దిగజారి పోయేటట్లు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే, టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేస్తున్నారని వీరి చర్యలను ఖండిస్తూ ఈ మధ్యకాలంలో జేఏసీ ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజన్ ఉద్యమాన్ని బలోపితం చేయడం జరిగిందని గత 14 రోజులుగా చేర్యాల పాత బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయని అయినను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ప్రజలు ఎదుర్కొంటున్న అసౌకర్యాలను గుర్తించి స్పందించకపోవడంతో వెంటనే చేర్యాల ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని జేఏసీ డిమాండ్ చేస్తూ 29 9 2023 శుక్రవారం రోజున పెద్ద ఎత్తున సడక్ బంద్ కార్యక్రమం ముస్త్యాల ప్రధాన రహదారి మేన్ రోడ్డుపై తలపెట్టడం జరుగుతుందని ఈ సడక్ బంద్ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా అందరూ తన సొంత సమస్యగా భావించి అధిక సంఖ్యలో పాల్గొని సడక్ బందును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ మండల కో కన్వీనర్ కొంగరి వెంకట మావో, జేఏసీ సాంస్కృతిక విభాగం మండల కన్వీనర్ మేడిపల్లి చందు, గ్రామ జేఏసీ నాయకులు మిన్నాల పురం అంజయ్య, మీస యాదయ్య,బాల మల్లయ్య సార్, ఎండి ఎజాస్, ఎండి అప్సాద్, గుండ్ర వీందర్, తరిగొప్పుల నర్సింలు , గూడెపు సురేందర్, గూడెపు సిద్దయ్య, తరిగొప్పుల సహదేవులు, చంద్రమౌళి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.





