మంచిర్యాల జిల్లా, భీమవరం మండలం.
భీమారం బస్టాండ్ లో ప్రయాణికుల కోసం సులబ్ కాంప్లెక్స్ నిర్మించాలి అని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందించిన భీమారం మండలం బిజెపి ప్రధాన కార్యదర్శి మాడెం శ్రీనివాస్.
ఏమనగా భీమారం మండల కేంద్రం బస్టాండ్ లో ప్రయాణికులు గంటల కొద్ది వేచి చూడాల్సి వస్తుంది. అలాంటి సమయంలో మహిళలకు టాయ్లెట్ కాని బహిర్బుమి కి వెళ్లాల్సి వస్తే చాల ఇబ్బంది పడుతున్నారు. కావున బస్టాండ్ సమీపంలోని చెరువు కట్టవద్ద సర్వే నెం,563/1 గల సర్వేనెంబర్ లో 4,గుంటల ప్రభుత్వ భూమి ఉన్నట్టు సంబంధిత అధికారులు సర్వే చేసి గుర్తించారు. కాని పని విషయంలో మాత్రం జాప్యం జరుగుతోంది కావున అట్టి విచయంలో మీరు చొరవ తీసుకుని ఆ యొక్క స్థలంలో సులబ్ కాంప్లెక్స్ కట్టించి ప్రయాణికుల సమస్య తీర్చగలరని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను ప్రజావాణి కార్యక్రమంలో కోరడమైనది.





