ఘనంగా రంజాన్ వేడుకలు.
మసీదులు, ఈద్గాల దగ్గర ముస్లిం సోదరుల ప్రత్యేక పార్థనలు
ఎల్లారెడ్డిపేట ఎప్రిల్ 11;
ఎల్లారెడ్డిపేట మండలం లో ముస్లీం సోదరులు రంజాన్ వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు,
నెల రోజుల పాటు సాగిన పవిత్ర రంజాన్ మాసం తర్వాత బుధవారం సాయంత్రం నెల వంక కనిపించడంతో ముస్లీం సోదరులు నూతన దుస్తులు ధరించి చిన్న పెద్ద తేడా లేకుండా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మాహామ్మదీయ ,ఖాదీమ్ జామే మసీద్ లతో పాటు రాచర్ల గొల్లపల్లి , బొప్పాపూర్ , వెంకటాపూర్ నారాయణపూర్ లోని మసీదుల వద్దా , ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు నమాజ్ చేశారు. ఈద్ ఉల్ ఫితర్ వేడుకల్లో చిన్నారులు, యువకులు, వృద్ధులు ఈద్గాలకు తరలివచ్చి ప్రత్యేక సామూహిక ప్రార్ధనలు నిర్వహించారు. ముస్లింల మత గురువులు రంజాన్ పండుగ విశిష్టతను వివరించారు.
అనంతరం హిందూ ముస్లిమ్ లు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ ఈద్ ముభారక్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు,
రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు తమ తమ మిత్రులను తమ ఇండ్లకు ఆహ్వానించుకొని సేమియా పాయసం , భగర్ , మటన్ బిర్యానీ , చికెన్ బిర్యానీ మాంసాహార బోజనముతో విందు లిచ్చి హిందూ ముస్లిమ్ బాయి బాయి అనే విధంగా తమ అభిమతాన్ని చాటారు పలువురికి ఆదర్శంగా నిలిచారు,
రంజాన్ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బిఆర్ ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అప్సరా అజ్జు ఇంటి లో రంజాన్ సందర్భంగా ఇచ్చిన విందు లో కాంగ్రెస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు,
రంజాన్ సందర్భంగా ముస్లిం సదర్ జాంగీర్ , ఆయూబ్ , షాదుల్ , మజీద్ కమిటీ ప్రతినిధులు హైమద్, జాఫర్, రఫిక్ , ఏదుల్ , గౌస్ బాయ్ , తాహేర్ , లతీఫ్ అజ్జు బాయ్ , తాజుద్దీన్ , రంజాన్ భాయ్, చాంద్ భాయ్ , హాజీ బాబా , డీలర్ బాబా, లారీ హైమద్ , హసన్ బాయ్ , జబ్బర్ బాయ్ , సద్దాం లను బిఆర్ ఎస్ పార్టీ
జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ,ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ కృష్ణ హరి, నాయకులు అందె సుభాష్, గుళ్ళో పెళ్ళి నర్సింహారెడ్డి , పరుశరాములు గౌడ్ , ఎలగందుల నరసింహులు , కోడూమోజూ దేవేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి , కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయ్ , తిరుపతి , పందిళ్ళ లింగా గౌడ్ , మర్రీ శ్రీనివాస్ రెడ్డి , కొండాపురం బాల్రెడ్డి, కొండాపురం శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు ,వంగ గిరిధర్ రెడ్డి , బండారి బాల్ రెడ్డి , పందిళ్ళ శ్రీనివాస్ గౌడ్, గంట ఆంజనేయులు గౌడ్, గంట వెంకటేష్ గౌడ్ , పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, వడ్నాల ఆంజనేయులు, దండు శ్రీనివాస్ లు సోషల్ మీడియా ప్రతినిధి బీపేటా రాజ్ కుమార్ పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు,
