Breaking News

రామకృష్ణాపూర్ కేతనపల్లి ఫ్లైఓవర్ పైన స్ట్రీట్ లైట్లు వెంటనే పెట్టాలి

36 Views

రామకృష్ణాపూర్ కేతనపల్లి ఫ్లైఓవర్ పైన స్ట్రీట్ లైట్లు వెంటనే పెట్టాలి.

మంచిర్యాల జిల్లా.

బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలకు మరియు నాయకులకు అందరికీ జై భీమ్ అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న విధంగా తయారయింది రామకృష్ణాపూర్ ఫ్లైఓవర్ పరిస్థితి ఎందుకంటే దశాబ్దాల కల నెరవేరింది అనుకున్న సంతోషం లేకుండా పోయింది రాత్రి పూట రామకృష్ణాపూర్ రావాలంటేనే భయపడుతున్న ప్రజలు ఎందుకంటే గతంలో ట్రాక్ దాటడానికి ప్రయత్నించి చాలామంది మరణించారు ఇప్పుడు ఫ్లైఓవర్ అయినా కూడా అదే పరిస్థితి చీకట్లో స్ట్రీట్ లైట్లు లేక ఎంతోమందికి యాక్సిడెంట్ అవుతున్నాయి నిన్న రాత్రి మేము రామకృష్ణాపూర్ వస్తున్న సమయంలో విధులకు వెళ్తున్న ఒక ఉద్యోగి ఆగి ఉన్న ట్రాలీని కనబడక వెనక నుండి ఢీకొనడం రోడ్డుమీద పడిపోయాడు హెల్మెట్ ఉండడం వల్ల ప్రాణాలతో బతికి బయటపడడం జరిగింది. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి రామకృష్ణాపూర్ ఫ్లైఓవర్ పైన పనికిరాని బొమ్మలు వేయడం కాదు ప్రజలకు ప్రాణాలు కాపాడే పనులు చేయాలని అదేవిధంగా ఫ్లైఓవర్ పైనున్న యూటర్న్ చాలా దారుణంగా తాత్కాలికంగా రిపేర్ చేయాలని గతంలో ఉన్న ప్రభుత్వం పని చేయట్లేదని ప్రజలు మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపిస్తే ప్రజలను పట్టించుకోవడంలేదని వెంటనే రామకృష్ణాపూర్ కేతనపల్లి ఫ్లైఓవర్ పైన స్ట్రీట్ లైట్లు వేయాలని ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని మరియు మంత్రి వివేక్ వెంకటస్వామి ని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్రప్రసాద్ మరియు ఇంచార్జ్ దాగం శ్రీనివాస్ జిల్లా నాయకులు మతిన్ ఖాన్ మంద వారి పట్టణ అధ్యక్షులు గాజుల శంకర్ రామకృష్ణాపూర్ పట్టణ నాయకులు బొల్లి నరేష్, రాజేష్ మండల నాయకులు తోటపల్లి రవి, చిలుముల గణేష్, రాజు, రవి తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *