బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం
సిద్దిపేట జిల్లా, గజ్వేల్, నవంబర్ 9
గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో కార్తీక బ్రాహ్మణ వనభోజన ఆత్మీయ సమ్మేళనం ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్ పల్లి లోని గంగు దివాకర్ రావు వ్యవసాయ క్షేత్రం లో అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏకవార రుద్రాభిషేకము ధాత్రి నారాయణ కళ్యాణ మహోత్సవము గాయత్రీ మహిళా సంఘం గజ్వేల్ వారిచేత లలితా సహస్రనామ పారాయణము మరియు విష్ణు సహస్రనా పారాయణం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైద్య ప్రభాకర్ శర్మ, కొండపోచమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ అధ్యక్షురాలు శ్రీమతి కప్పర అను గీతా, నాచారం ట్రస్ట్ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బోర్డ్ డైరెక్టర్ శ్రీమతి దేశపతి ఉషశ్రీ, గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సంఘం సమాఖ్య అధ్యక్షులు శంకర్ శర్మ , ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు, కోశాధికారి విటాల కృష్ణమూర్తి శర్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగేంద్రరావు, రాజేశ్వరరావు, శ్యాంప్రసాద్, యువజన సంఘం అధ్యక్షులు విటాల సాయి కృష్ణ, ప్రధాన కార్యదర్శి శ్యాం ప్రసాద్, కోశాధికారి రాఘవేంద్రరావు, పురోహితులు దేశపతి రాజశేఖర్ శర్మ, మురళీమోహన్ శర్మ, చిగుళ్ల సాకేత్ శర్మ, తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్రాహ్మణ బంధువులకు గజ్వేల్ డివిజన్ సేవా సమీక్ష పక్షాన కృతజ్ఞతలు తెలిపిన గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సంఘ సమాఖ్య అధ్యక్షులు శంకర్ శర్మ,,ఉదయం నుండి సాయంత్రం వరకు సంతోషంగా బ్రాహ్మణ కుటుంబాలు వైభవంగా కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహించారు





