ప్రాంతీయం

రాజ్యాంగ హక్కుల సాధన సభ విజయవంతం చేద్దాం

127 Views

హలో మాల చలో ఢిల్లీ

రాజ్యాంగ హక్కుల సాధన సభ విజయవంతం చేద్దాం

మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి

సిద్దిపేట జిల్లా,గజ్వేల్ నవంబర్ 9 

జాతీయ మాలమహానాడు ఆధ్వర్యంలో నవంబర్ 26న రాజ్యాంగ హక్కుల సాధన కోసం “ఛలో ఢిల్లీ” కార్యక్రమాన్ని ఈరోజు గజ్వేల్లో లోని ఛలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. జాతీయ మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి మాట్లాడుతూ* రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ఎంతకైనా పోరాటం చేయాలని, రాజ్యాంగ హక్కులను సాధించడానికే జాతీయ మాలమహానాడు ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.

డిమాండ్లు పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలి.

జాతీయస్థాయిలో మాల, మహార్ అనుబంధ కులాల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి.

శాస్త్రీయమైన లెక్కలు లేకుండా చేసిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, రోస్టర్ జీవో నెం. 99, జీవో నెం. 29 రాజ్యాంగ వ్యతిరేకం తక్షణమే పునః సమీక్షించాలి. (నవంబర్ 25న ఢిల్లీలో నిరసన,

ప్రైయివేటు రంగంలో రిజర్వేషన్ల చట్టం తీసుకురావాలి.

ఎస్సీ రిజర్వేషన్ల శాతాన్ని 15% నుండి 20% శాతానికి పెంచాలి.

దళితులపై దాడులను అరికట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి.

న్యాయస్థానాల్లో రాజ్య సభలో రిజర్వేషన్లు అమలు చేయాలి.

భారత రాజ్యాంగాన్ని అన్ని ప్రాంతీయ భాషల్లో నాన్- డీటైయిల్డ్ గా విద్యార్థులకు అందించాలి.

కరెన్సీ నోట్లపై భారతరత్న అంబేడ్కర్ ఫోటోను ముద్రించాలి.

బ్యాగరి, కాటికాపరులకు జాతీయస్థాయిలో తగిన గుర్తింపుతో పాటు కేంద్ర ప్రభుత్వం వేతనం అందించాలి.

ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల సహకారాలు అందించాలి.

రాజ్యాంగ పీఠికను ప్రేయర్లలో తప్పకుండా చదివేల చేయాలి. లాంటి

డిమాండ్లతో చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుందన్నారు. నవంబర్ 26న జరిగే ఛలో ఢిల్లీని విజయవంతం చేయడానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలిని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో,మాలమానాడు జిల్లా ఉపాధ్యక్షులు పాములపర్తి స్వామి, నీరుడి కుమార్, గజ్వేల్ మాల మహానాడు నాయకులు జంగం కాశి, నీరుడి సంపత్, పెండ్యాల మల్లేశం, కప్ప గణేష్, జంగ అరుణ్, ప్రభాకర్, జంగం పృధ్విరాజ్, ఆరేపల్లి భరత్, చంటి వంశీ, తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *