ఏప్రిల్ 6,24/7 తెలుగు న్యూస్ : రాష్ట్రాల రుణాలపై కేరళ సహేతుక పోరాటం హిందూ’ సౌజన్యంతో..
కేంద్ర రాష్ట్ర సంబంధాల చర్చలో ప్రభుత్వ రుణ నిర్వహణ సమస్య అంతకంతకూ ఎక్కువగా దృష్టినాకర్షిస్తున్నది. ఇటీవల కేంద్రం పదహారవ ఆర్థిక సంఘాన్ని నియమించడం ఇందుకు నేపథ్యంగా వుంది. రాష్ట్రాలు నికరంగా తీసుకునే రుణంపై కేంద్రం నిర్ణయించిన పరిమితిని సవాలు చేస్తూ కేరళ రాష్ట్రం సుప్రీం కోర్టులో కేసు వేసింది. భారత దేశంలో లోట్లు, రుణాలకు సంబంధించిన అసమాన ద్రవ్య నియమాలను ఈ తాజా పరిణామాలు గట్టిగా ముందుకు తెస్తున్నాయి. ఈ అంశాన్ని చాలా విస్త్రుతంగా చర్చ చేయాల్సిన అవసరముంది. ఎందుకంటే రుణం లోటు పరస్పర సంబంధాలు ఎలా వుండాలనేది ఈనాడు కేంద్ర రాష్ట్రాల ఆర్థిక సంబంధాల్లో అతి కీలకమైన ఏకైక సమస్యగా తయారైంది.
కోవిడ్-19 అనంతర కాలపు ద్రవ్య వ్యూహంలో ద్రవ్యలోటు జిడిపిలో 3.5 శాతం వుండాలని భావించడమైంది. మరో 0.5 శాతం విద్యుత్ రంగ సంస్కరణలతో ముడి పెట్టారు. ప్రభుత్వ సాధారణ రుణం జిడిపిలో 60 శాతం, కేంద్ర రుణం 40 శాతంగా నిర్ణయమైంది. కేరళ ప్రభుత్వం చేయవలసిన చెల్లింపుల మొత్తం 2024-25లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జిఎస్‌డిపిలో) 36.9 శాతంగా వున్నాయని బడ్జెట్ అంచనాలు చెబుతున్నాయి. అయితే ఇది చెల్లింపుల క్రమంలో మరింత పెరిగే అవకాశం ఎంతమాత్రం లేదు. ఎందుకంటే కేరళ తీసుకున్న అప్పులలో ఎక్కువ భాగం 2025 లోగా చెల్లించే అవకాశముంటుంది. ఈ సమయంలో చూస్తే తెలంగాణ అప్పు చెల్లింపుల గడువు మరింత ఎక్కువగా వుంది. తీసుకున్న అప్పులో 39.9 శాతం మళ్లీ కొత్త అప్పుగా మార్చుకుని ఒప్పందం చేసుకోవడానికి 2063 వరకూ సమయం వుంది. అదే కేరళ విషయంలో అది 14.7 శాతంగా వుంటుంది.
రాబడిలో స్థిరత్వం ఎలా?
రాబడిలో స్థిరత్వం అనేది ప్రభుత్వ వ్యయ ప్రణాళికకు ప్రాతిపదికగా వుంటుంది.కేరళ స్వంత పన్ను రాబడి మొత్తం రాబడిలో 48 శాతంగా వుంది. ఇక లాటరీలతో సహా పన్నేతర రాబడి 12 శాతంగా వుంది. ఇటీవలనే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ద్రవ్య సంబంధమైన అంచనాల చిత్రం ప్రచురించారు. అలాగే 2023లో వాస్తవంగా వచ్చిన వాటినీ పొందుపర్చారు. 2023 లెక్కల ప్రకారం ద్రవ్య సంబంధమైన నిర్వహణ నైపుణ్యం (అంటే బడ్జెట్ అంచనాలలో వాస్తవ సంఖ్యలు సరిపోలడం) పన్ను ఆదాయం విషయంలో 57.23 శాతం వుంది. కానీ జిఎస్‌టి విషయంలో ఈ లెక్క 2023కు అంతకు ముందు ఏడాది కన్నా మెరుగ్గా వుంది. 54.21 నుంచి 56.30 శాతానికి పెరిగింది.
ప్రభుత్వాల మధ్య ద్రవ్య లావాదేవీలలో తీవ్ర హెచ్చుతగ్గులు ఆందోళన కలిగిస్తున్నాయని కేరళ ప్రభుత్వం పేర్కొంది. ఏళ్లు గడిచేకొద్ది కేరళతో సహా కొన్ని రాష్ట్రాలకు కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే వాటా క్షీణిస్తున్నది. కేరళకు ఫైనాన్స్ కమిషన్ నుంచి సంక్రమించే వాటా 13వ ఫైనాన్స్ కమిషన్ నాటికి 2.341 శాతం వుంటే 14వ ఫైనాన్స్ కమిషన్‌లో 2.5 శాతానికి పెరిగింది. కానీ 15వ కమిషన్ నాటికి అది కేవలం 1.925 శాతం దగ్గరే వుండిపోయింది.
15వ ఫైనాన్స్ కమిషన్ పన్ను బదలాయింపు ఫార్ములాను ఇలా నిర్ణయించింది. జనాభా (15 శాతం), విస్తీర్ణం (15 శాతం), ఆదాయ వ్యత్యాసం (45 శాతం), జనాభా పరివర్తన (12.5 శాతం), అటవీ పర్యావరణ అంశాలు (10 శాతం), పన్ను పెంపుపై కృషి (2.5శాతం), పన్ను రాబడుల బదలాయింపు సందర్భంలో తలసరి ఆదాయంలో రాష్ట్రాల వారీ దూరం అనే అంశానికి ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన ప్రాధాన్యత అభివృద్ధి చెందుతున్న కేరళ వంటి రాష్ట్రాలకు నష్టదాయకంగా పరిణమిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ద్రవ్య బదలాయింపులో సమానతకూ సమర్థత అనే అంశాల మధ్య వివాదానికి దారితీస్తుంది. పేద రాష్ట్రాలు సంపన్న రాష్ట్రాలను అందుకునే విధంగా ఆర్థిక మేళవింపు జరగాలన్నదే కేంద్ర ఫైనాన్స్ కమిషన్ ప్రధాన చింత అయినట్టయితే వ్యత్యాసానికి లెక్కింపు వేయడం సరైందవుతుంది. ఇక్కడ జరిగింది వేరు.
మౌలిక సదుపాయాల వృద్ధి
ఈ ఆందోళనలు ఒకవైపున వుండగా ప్రజా ఫైనాన్స్ రంగంలో డిజిటల్ మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడం ద్వారాపన్ను కృషి పెంచడమనేది కీలక ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అధికతర ప్రభుత్వ రుణం నిరంత రాయంగా స్థూల పెట్టుబడి కల్పనతో అనుసంధానం చేయాలి. ప్రత్యక్ష డిజిటల్ సామాజిక రంగాల్లో ఇది జరగాలి. యుద్ధాలు సంక్షోభాల సమయంలో ఆహార ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే సరఫరా గొలుసు విచ్ఛిన్నమవడమే దీనికి కారణమవుతుంది. ఇంధన ధరలు కూడా విపరీతమైన ఒడుదుడుకులకు గురవుతాయి. అందువల్ల ఆహార భద్రతా చర్యల కొనసాగింపు కీలకమవుతుంది. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ద్రవ్య విధానం ముఖ్యం. గత బడ్జెట్‌లో కూడా కేరళ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి మద్దతు ప్రకటించింది.
రాష్ట్రం నికరమైన ఆర్థికాభివృద్ధి సాధించాలంటే దృఢమైన పర్యావరణ హితమైన విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థ కీలకం. బడ్జెట్‌లో సముచితమైన కేటాయింపులతో అనువర్తిత సమాచారం అనుసంధానం చేయవలసి వుంటుంది. ఫైనాన్స్ కమిషన్‌తోనూ న్యాయమైన సంప్రదింపులు జరపాల్సి వుంటుంది, దేనికి ఎంత ప్రాధాన్యతనివ్వాలనే అంశంతో సహా జరపాల్సిన ఈ సంప్రదింపుల ద్వారానే రాష్ట్రానికి ద్రవ్య బదలాయింపులు క్రమానుగతంగా పెంచుకోవడం సాధ్యమవుతుంది. పదహారవ ఫైనాన్స్ కమిషన్‌తో పున: సంప్రదింపులు ప్రారంభించవవలసి వుంటుంది. జనాభా పరివర్తన, రాష్ట్రంలోకి వెలుపలికి కొనసాగే వలసల తీరు వాతావరణ మార్పుల సంక్షోభం వంటి వాటి నిర్దిష్టమైన ప్రత్యేక సమస్యలను గమనంలో వుంచుకుని ఈ చర్చలు సాగాలి.
జెండర్ సమానత
బడ్జెట్‌లో జెండర్ వ్యత్యాసాలు తగ్గించడం కోసం జెండర్ సమానత్వ కేటాయింపుల ఆధారంగా ద్రవ్య బదలాయింపులు చేయడం చాలా ముఖ్యం. శ్రమశక్తిలో మహిళల భాగస్వామ్యం పెంచడానికి ఆ విధంగానే అవకాశం కలుగుతుంది. జెండర్ స్పృహతో పెట్టుబడి సమీకరణ జరగాలంటే బడ్జెట్‌లో న్యాయం జరగాలి. ఎన్నికల ముందు బడ్జెట్ విశ్వసనీయత కీలక పాత్ర వహిస్తుంది.
ఖర్చులు తగ్గించడం ద్వారా పొదుపు చర్యలు అమలు చేయడం పెట్టుబడి సమీకరణను, మానవాభివృద్ధిని దెబ్బ తీస్తుంది. ద్రవ్య నిర్వహణలో సమర్థమైన ముద్ర వేయడమే ఎన్నికల సంవత్సరంలో సరైన మార్గమవుతుంది.
‘




