తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర .
అధికారంలోకి వచ్చేది బీసీ రాజ్యాధికార పార్టీఏ.
అగ్రవర్ణాల నాయకుల రాజకీయ సమాధులు కడతాం.
మహేష్ వర్మ టీఆర్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు.
మంచిర్యాల జిల్లా : బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండలంలో తెలంగాణ రాజ్యాధికారి పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని తీన్మార్ మల్లన్న ఆదేశాలమేరకు మహేష్ వర్మ అధ్యక్షతన, జిల్లా కార్యదర్శి రాంటెంకి శ్రీనివాస్, జిల్లా నాయకులు గ్రామ పర్యటనలు మొదలు పెట్టారు. అగ్రవర్ణాల రాజకీయ నాయకుల స్వార్థ రాజకీయాలకు ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న బిజెపి మండల అధ్యక్షుడు ఏట మధుకర్ ఇంటి నుంచే ఈ చైతన్య యాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మహేష్ వర్మ తెలిపారు. అగ్రవర్ణ రాజకీయ ఆధిపత్యానికి, వారి ఆగడాలకు బలి అవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, నాయకులకు ధైర్యం అందించేందుకు, అగ్రవర్ణ రాజకీయ నాయకుల రాజకీయ భవిష్యత్ కి రాజకీయ సమాధులు కడతామని మహేష్ వర్మ అన్నారు. వేమనపల్లి మండలంలోని 33 గ్రామాలు తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు, పడుగు బలహీన వర్గాల కోసమే తెలంగాణ రాజ్యాధికారి పార్టీ పనిచేస్తుందని, ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా పనిచేస్తుందని అన్నారు, మండలంలో ఉన్న స్థానిక ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణాల నాయకులకు , పార్టీలకు భయపడేది లేదని స్పష్టం చేశారు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న అధ్యక్షతన ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్న వాటిని పరిష్కరించే దిశగా జిల్లాలో పనిచేస్తుందని, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరించే విధంగా పనిచేస్తానని అన్నారు, రానున్న రోజుల్లో ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోటీ చేసి అగ్రవర్ణాల పార్టీలను ఓడ గొట్టి, బహుజనుల రాజ్యాధికారం సాధించే విధంగా తెలంగాణ రాజ్యాధికారి పార్టీ పనిచేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఎండి లతీఫ్, జిల్లా నాయకులు బండారు చిరంజీవి, దాస్యపు దీపక్, పడాల శివతేజ తదితరులు పాల్గొన్నారు.





