బాధిత కుటుంబానికి బాల్య మిత్రుల ఫిక్స్డ్ డిపాజిట్ అందజేత…
Ts/24 రిపోర్టర్ అమరవాజీ శ్రీకాంత్ (నిజామాబాద్,) ప్రతినిధి
వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన బండారి అశోక్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగించాడు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ తో తోటి మిత్రుడైన బండారి అశోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.. పూర్వ విద్యార్థులైన 1994 -95 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు మరణించిన తోటి స్నేహితుడు అశోక్ కుటుంబానికి పిల్లలకు భరోసాగా పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్ డిపాజిట్ పథకం కింద 70,000/-రూ. ఆర్థిక సాయం వారి కుటుంబానికి అశోక్ స్వగృహంలో శుక్రవారం అందజేశారు. బాల్యమిత్రుడు మరణించడం మాకు తీరని లోటు అని చిన్ననాటి స్నేహితులను కలచివేసిందన్నారు. ఒక మంచి మిత్రుని కోల్పోయామని ఆయన మరణం మాకు తీరని బాధను, అందరి మనసులను చూరగొన్న అశోక్ మాకు దూరం కావడం కలచివేసిందన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చంటి రవి కృష్ణ మంగళవారం జనార్థన్ యాళ్ల రమేష్, కటిక కిషన్, ప్రకాష్, రమేష్ భోజన్న మచ్చ ఆనంద్. శ్రీనివాస్, అన్నపూర్ణ కల్పన, తదితరులు వెంట ఉన్నారు.





