బ్రిటిష్ వలసవాదుల పాలనలో భారతదేశం ఉన్నప్పుడు స్వాతంత్ర్య ఉద్యమంలో దేశ ప్రజలను వందేమాతరం గీతం స్ఫూర్తితో చైతన్యం చేస్తూ ఉద్యమంలో పాల్గొనడం జరిగిందని రాయపోల్ ఎంపీడీవో జేమ్లా నాయక్ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వందేమాతరం 150 సంవత్సరాల వేడుకలు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందేమాతరం గీతం 1875 సంవత్సరంలో బంకించంద్ర చటర్జీ రచించడం జరిగిందని, మొదటిసారి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా బెంగాల్ లో వందేమాతరం గీతాన్ని ఆలపించడం జరిగిందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో దేశ ప్రజలను చైతన్యం చేయడానికి, దేశభక్తిని పెంపొందించడానికి వందేమాతరం గీతం దోహద పడిందన్నారు. 2025 నాటికి వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు గడిచిన సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించి సామూహికంగా వందేమాతరం గీతం ఆలపించాలని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం మేరకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆదేశాల మేరకు రాయపోల్ మండలంలో అన్ని పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, పోలీస్ స్టేషన్ లో వందేమాతరం గీతం ఆలపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి శివకుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.





