ప్రాంతీయం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…

186 Views
 ముస్తాబాద్, అక్టోబర్ 6 (24/7న్యూస్ ప్రతినిధి): పూర్వ విద్యార్థుల సమ్మేళనం అలరించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం జెడ్పి బాలుర ఉన్నత పాఠశాలలో 2000-2001 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత ఈ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని తమ చిన్ననాటి విషయాలను అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని సంతోషాన్ని వ్యక్తపరిచారు. పదవ తరగతి అనంతరం ఉన్నత విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో స్థిరపడ్డ విషయాలను గుర్తుచేశారు. తమ గురువులు చెప్పిన మార్గదర్శకంలో తాము స్థిరపడ్డామని తెలుపుతూ అప్పటి గురువులు ఆనందరావు, సుధాకర్ రెడ్డి, అశోక్, వడ్లకొండ చంద్రం, హెచ్ఎం రవీందర్ లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్వ విద్యార్థులు మల్లారపు సంతోష్ రెడ్డి, మెంగని మనోహర్, బండారు శ్రీకాంత్, రాచమడుగు రాజు, పెంజర్ల బాల ఎల్లం, దబ్బెడ చంద్రం, నీలం సత్యనారాయణ, పుల్లూరి రాజు, మద్దికుంట రాజు, గున్నాల వెంకటస్వామి, మట్ట ప్రవీణ్, వరద రాజు, సంగీత, గిరిజ తో కలిపి 90 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్