*రామగుండం పోలీస్ కమీషనరేట్*
*మౌనంగా ఉండొద్దు..ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం*
*మహిళ రక్షణ కై షీ టీమ్స్ ఎల్లప్పుడూ సిద్ధ : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్.,*
మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చునని, మహిళల రక్షణ కోసమే షీ టీమ్స్ పనిచేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ లో రెండు షీ టీం బృందాలు పని చేస్తున్నాయని షీ టీం ఆధ్వర్యంలో వివిధ ప్రదేశాలలో, స్కూల్స్ , కాలేజీ లలో ర్యాగింగ్/ఈవ్ టీజింగ్/పోక్సో/ గుడ్ టచ్ బ్యాడ్ టచ్/ఆత్మహత్యలు/డ్రగ్స్ /బాల్య వివాహాలు/వరకట్నం చట్టాలపై, నూతన మహిళా చట్టాలపై, డయాల్ 100, T-SAFE యాప్ మహిళ భద్రత, రక్షణ చర్యలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తునట్లు తెలిపారు. టీమ్ సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదులు తీసుకుంటారని, ఆన్లైన్, QR code, వాట్సప్ ద్వారా కూడా స్వీకరిస్తారని తెలిపారు. మహిళలు, బాలికలపై ఆన్లైన్లో అసభ్యకర పోస్టులు పెట్టే వారు, సైబర్ నేరగాళ్లపై కూడా సైబర్, షీ టీమ్ సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. మహిళలు బాలికలు విద్యార్థులు షీ టీం సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలిపారు. ఎవరైనా వేధించిన, రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేళనగా మాట్లాడిన, ఉద్దేశపూర్వకంగా వెంబడించిన, అసభ్యకరంగా ప్రవర్తించిన, మాట్లాడిన విద్యార్థినిలు, మహిళలు అత్యవసర పరిస్థితులలో *రామగుండం పోలీస్ కమిషనరేట్ షీ టీం నెంబర్ 6303923700, పెద్దపల్లి జోన్ షీ టీమ్ నెంబర్ 8712659386 మంచిర్యాల జోన్ షీ టీమ్ నెంబర్ 8712659386 కి కాల్ చేసి, వాట్సాప్ ద్వారా సందేశం పంపించి లేదా డయల్ 100 కు* కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సీపీ సూచించారు.
*అక్టోబర్ – 2025 నెలలో రామగుండం కమిషనరేట్ షీ టీమ్స్ కార్యకలాపాల వివరాలు:*
షీ టీమ్ కు అందిన మొత్తం ఫిర్యాదులు – 69
వీటిలో 12 ఫిర్యాదులు నేరుగా షీ టీమ్స్ రామగుండం కార్యాలయాలకు (పెద్దపల్లి జిల్లా & మంచిర్యాల జిల్లా) అందాయి.
57 కేసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన (ఫిర్యాదులు – 12, రెడ్ హ్యాండెడ్ – 57) ఈ 12 ఫిర్యాదులలో FIR నమోదు చేసినవి – 04
చిన్న కేసులు (Petty Cases) – 03
కౌన్సిలింగ్ ఇచ్చినవి – 01
కౌన్సిలింగ్ నిర్వహించి హెచ్చరించి విడిచిపెట్టినవి – 02, సంబంధిత పోలీస్ స్టేషన్‌కి పంపినవి – 01, విచారణలో ఉన్నవి – 01
షీ టీమ్స్ పెద్దపల్లి & మంచిర్యాల జోన్ లలో పబ్లిక్ ప్రదేశాలు, పార్కులు, షాపింగ్ మాల్ ప్రాంతాల్లో డేకాయ్ ఆపరేషన్స్ నిర్వహించి, మొత్తం 60 మంది నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, వారిపై పెట్టి కేసులు నమోదు చేసి, కౌన్సిలింగ్ ఇవ్వడం, తల్లిదండ్రుల సమక్షంలో హెచ్చరించడం జరిగింది.
ఈ 57 రెడ్ హ్యాండెడ్ కేసుల్లో:
పెట్టి కేసులు – 06
కౌన్సిలింగ్ – 08
హెచ్చరించి పంపించిన వారు – 43
*అక్టోబర్ – నెలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు*
పెద్దపల్లి జోన్ – 28
మంచిర్యాల జోన్ – 25
మొత్తం – 53
*అక్టోబర్ – నెలలో సందర్శించిన హాట్ స్పాట్ ప్రాంతాలు*
పెద్దపల్లి జోన్ – 117
మంచిర్యాల జోన్ – 126
మొత్తం – 243





