రోడ్డు ప్రమాదంలో దుమాల వాసి మృతి
విషాదం లో దుమాల
ఎల్లారెడ్దిపేట మేజర్ గ్రామపంచాయతీ శివారులో కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారి లో గల హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం మద్యాహ్నం 3:30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో దుమాల గ్రామానికి చెందిన
జాలపెల్లి అంజయ్య (38) అక్కడికక్కడే మరణించారు,
దుమాల గ్రామానికి చెందిన జాలపెల్లి అంజయ్య (38) అనే పెయింటర్ సమీపంలో హెచ్ పి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకోడానికి వెళుతుండగా కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారి పై నిజామాబాద్ జిల్లా కు చెందిన టిఎస్ ఆర్ టిసి ఎలక్ట్రీకల్ బస్ బైక్ ను డీ కొట్టడం తో బైక్ పై వెళ్తున్న అంజయ్య అక్కడికక్కడే మరణించాడు,
అతనికి ఎనిమిది నెలల క్రితమే సుస్మీత తో వివాహం అయింది ఘటన స్థలానికి ఎస్ ఐ రాహుల్ రెడ్ది చేరుకొని కేసు న

మోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని సిరిసిల్ల ఏరియాసుపత్రికి తరలించారు,
మరణ వార్త విని అతని భార్య సుస్మిత అతని కుటుంబ సభ్యులు శోకసముద్రమయ్యారు దీంతో దూమల గ్రామంలో విషాదం నెలకొన్నది





