Breaking News

విద్యార్థులు బాల్యంలోనే జీవిత లక్ష్యాన్ని ఎంచుకోవాలి  మర్కుక్

112 Views

.విద్యార్థులు బాల్యంలోనే జీవిత లక్ష్యాన్ని ఎంచుకోవాలి

మర్కుక్

విద్యార్థులు బాల్యంలోనే జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యం వైపు పాయనించాలని బీఆర్ఎస్ పార్టీ మర్కుక్ మండలాద్యక్షులు మర్కుక్ కర్ణాకర్ రెడ్డి, ఎంపీపీ పాండు గౌడ్ ,జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రంలు అన్నారు. సోమవారం ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ జన్నదినం పురస్కరించుకొని మర్కుక్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో చదువుతున్న 240 మంది విద్యార్థులుకు స్పోర్ట్స్ డ్రెస్స్ లు, సీసీ కెమెరాలు వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి , ఎంపీటీసిల పోరం మర్కుక్ మండలాద్యక్షులు రాజమైన కృష్ణ యాదవ్,మర్కుక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్, గంగాపూర్-యూసుప్ ఖాన్ పల్లి సర్పంచ్ గడ్డం ప్రసాద్ తో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం లో నే మీ జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం శ్రమిస్తే తప్పకుండా విజయాన్ని సాధిస్తారన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం దాతలు అందిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకొని క్రమశిక్షణ తో చదివితే విద్యార్థులు సత్ఫలితాలను సాధించవచ్చునన్నారు.విద్యార్థి దశ నుండే మంచి నైపుణ్యం అలవర్చుకోవాలన్నారు. తల్లిదండ్రులకు విద్య నేర్పిన గురువులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని‌ ఆకాంక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి.స్వీట్లను పంపిణీ చేశారు.అంతకు ముందు పాఠశాల అవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గాజే నర్సింలు, గాయత్రి బాల నర్సయ్య, గజ్వేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పత్తి బాబు యాదవ్, బీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య,బీఆర్ఎస్ నాయకులు అలేటి సంతోష్ రెడ్డి, అజయ్ రెడ్డి, సాయిని మహేష్,పాపొల్ల రాజు,సంతోష్,

నాగిరెడ్డి, కృష్ణ,మ్యాకల శ్రీను, ప్రవీణ్, సాయి గౌడ్

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *