మంచిర్యాలలో బీఎస్పీ పార్టీలో నాగుల కిరణ్ బాబు ఆధ్వర్యంలో యువత చేరికలు.
మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వరరావు హాస్పిటల్ ప్రాంగణంలో ఈరోజు బహుజన సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు ఆధ్వర్యంలో యువత భారీ చేరిక కార్యక్రమం జరిగింది. జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ బొల్లి నరేష్, తోటపల్లి రవి, చిలుముల గణేష్, రాజేష్ ,రాజు, రవి తదితరులు పార్టీలో కి రావడం జరిగింది. రానున్నది బహుజన రాజ్యమని బహుజనులకు కేవలం బహుజన్ సమాజ్ పార్టీ వలనే రాజ్యం వస్తుందని కల్లబొల్లి మాటలు చెప్పుతూ కాలం గడుపుతున్న పార్టీల వల్ల బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రాదని మరి ఆనాడే మాన్యవర్ కాన్సిరాం మనమెంతో మనకంత అన్న నిదానం లేవనెత్తిన మహనీయుడు ఆశయాలతో పుట్టిన బహుజన సమాజ్ పార్టీతోనే కేవలం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధ్యమవుతుందని బీసీ యువతీ యువకులు ఈ విషయాన్ని గమనించి బహుజన్ సమాజ్ పార్టీలో చేరి బలోపేతం చేసి బహుజన రాజ్యం తీసుకురావాలని మహనీయులు కన్నా కలను నెరవేర్చమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు కాదశి రవీందర్ మరియు జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్రప్రసాద్, దాగం శ్రీనివాస్, గాజుల శంకర్, మల్లేష్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.





