ముస్తాబాద్ డిసెంబర్ 5, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సోమవారం రోజున బాలర పాఠశాలలో మాధురి ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నామినేషన్ వేయడం ఉపసంహరించుకోవడం ఎన్నికల ప్రచారం ఎన్నికల వ్యవస్థ ఓటుహక్కు వినియోగం పోలీస్ సిబ్బంది విధులు నిర్వహణ పోలింగ్ అనంతరం కౌంటింగ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ గెలుపొందిన వారిచే ప్రమాణ స్వీకారం చేయించడంవంటి అంశాలపై అవగాహనపై నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిధులు సంబంధిత ఎంపీడీవో రమాదేవి, గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, ఎస్ఎంసి చైర్మన్ ఎస్ పరశురాములు, ప్రధానోపాధ్యాయులు బి.విట్టల్ నాయక్, పాఠశాల సిబ్బంది, బి.వి. రావు, బుచ్చిరెడ్డి, రాజిరెడ్డి లక్ష్మి, జబీన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
