ప్రాంతీయం

బహిరంగంగా ఉరి తీయాలి

117 Views

అత్యాచారానికి పాల్పడిన మానవ మృగాన్ని బహిరంగంగా ఉరి తీయాలి

•సోమల్ల మహేందర్ కురుమ రాష్ట్రీయ సంగోలి రాయన్న సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

-నిందితున్ని శిక్షించి బాధితులకు న్యాయం చేయాలి

-ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి

-ఉన్నవారికి ఒక న్యాయం పేదవారికి ఒక న్యాయం ఉండకూడదు

సిద్దిపేట జిల్లా అక్టోబర్ 3

కొమురవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో కడు పేద కుటుంబానికి చెందిన మైనర్ బాలికపై జరిగిన హత్యాచార ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ సంగోలి రాయన్న సేన రాష్ట్ర అధ్యక్షులు సోమల్ల మహేందర్ కురుమ భువనగిరి లో మీడియాతో మాట్లాడుతూ గురువన్న పేట గ్రామంలోని సామజికంగా అభివృద్ధికి నోచుకోని కురుమ గొర్ల కాపార్ల సామాజిక వర్గానికి చెందిన ఏడవ తరగతి చదువుతున్న, కడు పేద కుటుంబానికి చెందిన మైనర్ బాలిక పై షరీఫ్ అనే వ్యక్తి(20) అత్యాచారానికి పాల్పడటం మానవత్వం.

మంటగలిపే సంఘటన నిందితుని తక్షణమే ఉరితీయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకూ రాష్ట్రీయ సంగోలి రాయన్న సేన పోరాడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వాలు ఎంత కఠిన చట్టాలు తీసుకొచ్చిన ఇలాంటి మానవ మృగాలు ఎక్కడొక చోట ఇలాంటి ఘటన పాల్పడుతున్నారని ఇలాంటి మానవ మృగాలను వెంటనే ఉరితీయాలి బాధితుల పక్షాన ప్రభుత్వం నుండి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు,

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్