– పోలీస్ అమరవీరులకు అంకితమిచ్చిన రామకోటి రామరాజు
జాతీయ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ సేవలను గుర్తుచేస్తూ పోలీస్ అమరవీరుల స్తూపాన్ని వినూతన కళకు శ్రీకారం చుట్టి నల్లని నువ్వులను ఉపయోగించి 6అడుగుల అద్భుత స్థూప చిత్రాన్ని రూపొందించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి నివాళులు అర్పించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య రక్షణే పరమావధిగా, సమాజ శ్రేయసస్సే ఊపిరిగా, ప్రజల కొరకు వీరి ప్రాణాలనే పణంగా పెట్టిన పోలీస్ యోధులన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ చిత్రాన్ని వారికి అంకితమిచ్చారు .





