మంచిర్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ జన్మదినం సందర్భంగా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.
మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆటో యూనియన్ జేఏసీ ప్రణాళిక చైర్మన్, మంచిర్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ జన్మదినం సందర్భంగా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో 20 మంది రక్తం దానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పొట్ట మధుకర్, చెల్లె విక్రమ్, అబ్దుల్ రహీం మరియు తదితరులు పాల్గొన్నారు.





