శ్రీశైలం మృతదేహం లభ్యమైంది
మంచిర్యాల జిల్లా: చెన్నూరు నియోజకవర్గం.
కోటపల్లి మండలం రొయ్యలపల్లీ గ్రామానికి చెందిన యువకుడు శ్రీశైలం మృతదేహం లభ్యమైంది.సోమవారం ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయిన విషయం తెలిసిందే.శ్రీశైలం మృతదేహాన్ని చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశీలించిన మంత్రి వివేక్ వెంకటస్వామి. అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన మంత్రి వివేక్.





