బీసీ బందుకు మద్దతు తెలిపిన ఎమ్మార్పీఎస్ మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లా.
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బంద్ లో భాగంగా మంచిర్యాల పట్టణ కేంద్రంలోని వ్యాపారస్తులను దుకాణాలను మూసి వేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు స్థానిక ఎలక్షన్లో 42 శాతం రిజర్వేషన్ ఇస్తానని ఇప్పటివరకు ఇవ్వకపోవడం దారుణమని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న టిఆర్ఎస్ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అన్ని పార్టీలు బీసీల 42 శాతం రిజర్వేషన్ కు మద్దతు ఇచ్చినప్పుడు మరి లోపం ఎక్కడ ఉందని ప్రశ్నించడం జరిగింది ఇకనైనా బీసీలకు ఏడో షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించి 42 శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని బీసీలు చేసే ఉద్యమంలో ఎమ్మార్పీఎస్ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో భాగస్వామ్యం అవుతూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఎమ్మార్పీఎస్ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సుందిళ్ల మల్లేష్ మాదిగ, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు చిప్పకుర్తి మల్లేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మంతెన మల్లేష్ మాదిగ, నక్క అంజన్న మాదిగ, ఇరుగురాల మల్లేష్ మాదిగ, అట్కపురం రాయమల్లు మాదిగ, వేల్పుల సమ్మయ్య మాదిగ, నాయకులు రాచర్ల రాజయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.




