ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీలో ప్లానింగ్ ప్రాసెస్ సమావేశం….
Your message has been sent
ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీలో ప్లానింగ్ ప్రాసెస్ సమావేశంరెడ్డిపేట గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో సత్తయ్య ప్రత్యేక అధికారి గారి అధ్యక్షతన సమావేశం జరిగింది.
2026–2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జాతీయ ఉపాధి హామీ పథకం కార్మిక బడ్జెట్‌ను తయారు చేయడం కోసం, అలాగే కొత్త పనులను గుర్తించి అమలులోకి తేవడం కోసం ఈ గ్రామ సభలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.2025–2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను గతంలో పంపించిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం అదనంగా బడ్జెట్‌ను మంజూరు చేసినందున, ఆ సంవత్సరానికి సంబంధించిన జీపీడీపీ యాక్షన్ ప్లాన్‌ను సవరించి తిరిగి పంపించబడింది.ఈ గ్రామ సభలో ఏపీవో కొమరయ్య, ఉపాధి హామీ ఇంజనీర్ రాజు, సాంకేతిక సహాయకుడు ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్,ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కొనేటి నరేష్, కార్మికులు మరియు గ్రామ సభ సభ్యులు హాజరయ్యారు. హాజరైన వారందరూ ఏకగ్రీవంగా ఆమోదించి పై అధికారులకు పంపించాలని కోరారు.





