మద్యం టెండర్లకు భారీగా తగ్గిన డిమాండ్.
మంచిర్యాల జిల్లా.
రేపటితో (అక్టోబర్ 18) మద్యం టెండర్లుకు గడువు ముగియనుంది. అయితే గతేడాది 1.31 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి డిమాండ్ తగ్గింది. ఈసారి లక్షలోపే దరఖాస్తులు ఉండొచ్చని అంచనా, బుధవారం వరకూ 9,600 దరఖాస్తులు మాత్రమే రావగా, గురువారం ఒక్కరోజే 10 వేల దరఖాస్తులు వచ్చాయి. శనివారంతో గడువు ముగియనుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ మందగమనమే కారణమని చెబుతుండగా, సిండికేట్ లాగా మారి, పోటీ లేకుండా దరఖాస్తులు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.





