గజ్వేల్ పట్టణంలో గాయత్రి సూపర్ మార్కెట్ మరియు పూజ స్టోర్‌ను దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సూపర్ మార్కెట్ యజమాని మాజీ ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ దాంపత్యం. విశాలమైన స్థలంలో ఆధునిక సౌకర్యాలతో ఈ సూపర్ మార్కెట్ ప్రారంభమైంది. ప్రజలకు అవసరమైన అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉండేలా సదుపాయాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, తాజా మాజీ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, సీనియర్ నాయకులు రణం శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర యువజన విభాగం నాయకులు రాజీరెడ్డి, రైతుబంధు మాజీ అధ్యక్షులు మున్నా, మాజీ కోఆప్షన్ సభ్యులు పర్వేజ్, మాజీ సర్పంచ్ కరుణాకర్, నాయకులు మల్ల గౌడ్, బాల్ నర్స్, లక్ష్మారెడ్డి, మల్లేశం, తాడేం కృష్ణ, దుర్గయ్య, శ్రీనివాస్, గణేష్, రాజు, రాజా నర్స్, స్వామి తదితరులు పాల్గొన్నారు.





