సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం, అల్వాల గ్రామంలో పాటి నర్సింలు (32) ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. వారికి ఇద్దరు కూతుర్లు హిమత (5), ప్రిన్సి (2), ఉన్నారు. వారి కుటుంబానికి అఖిల రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తౌడ సత్యనారాయణ 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్వాల తాజా మాజీ సర్పంచ్ కిష్టయ్య, అఖిల రాజ్ ఫౌండేషన్ సభ్యులు సాయిలు, నాగరాజు, స్వామి, అశోక్, బాబు, రాజయ్య, రాజు, రాజయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.





