నిత్యం ప్రజల్లో ఉండే ప్రజా నాయకులను డీసీసీకి ఎంపిక చేయడమే లక్ష్యమని ఏఐసీసీ అబ్జర్వర్, ఉత్తరాఖండ్ మహిళా అధ్యక్షురాలు జ్యోతి రౌటేల అన్నారు. మంగళవారం రోజున తొగుట మండలం రాంపూర్ (చెరుకు బాలమ్మ బాలకృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి దరఖాస్తుల స్వీకరణకి ముఖ్యఅతిథిగా వచ్చిన ఏఐసీసీ అబ్జర్వర్, ఉత్తరాఖండ్ మహిళా అధ్యక్షురాలు జ్యోతి రౌటేల, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పిసిసి కో-ఆర్డినేటర్ మహమ్మద్ నజీర్, డిసిసి అధ్యక్షులు తుంకుంట నర్స రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ లతో కలిసి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో నేరుగా కార్యకర్తలతో మాట్లాడుతూ అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మాజీ ఎంపీటీసీ స్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకోసం పనిచేసే నాయకులకు తప్పక గుర్తింపు ఉంటుందని ఇందులో భాగంగానే ప్రతి జిల్లాలో స్థానిక నేతలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నామని చెప్పారు అని తెలిపారు.





