ముస్తాబాద్,
ప్రతినిధి వెంకటరెడ్డి బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన ప్రముఖ న్యాయవాది ఆవునూరి రమాకాంత్ రావును బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, గూడూరి ప్రవీణ్ మంగళవారం ఆయన గృహంలో కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, జిల్లా ఏర్పాటు సమయంలో రమాకాంత్ రావు పోషించిన పాత్రపై చర్చించారు. రాజీనామా ప్రకటించిన గంటల వ్యవధిలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయనను కలవడం సిరిసిల్లలో చర్చనీయాంశంగా మారింది.




