నన్ను రేయ్ అంటావా గుడ్డలు ఊడదీసి కొడతా అంటున్న బిజెపి నేత.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి ముందే మాజీ ఎంపీ వెంకటేష్ నేతపై జారిన గోమాత శ్రీనివాస్.
మంచిర్యాల జిల్లా, నీల్వాయి.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ముందే బిజెపి పార్లమెంట్ నేతలు ఇద్దరు గొడవపడ్డారు. అధ్యక్షుడు ముందే నన్ను రేయ్ అంటావా అని పెద్దపల్లి కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేతపై నోరు జారారు, గుడ్డలు ఊడదీసి కొడతా అని అన్నారు.
ఏట మధుకర్ కుటుంబాన్ని పరామర్శించడానికి చెన్నూరు నియోజకవర్గం, నీల్వాయి గ్రామానికి వచ్చిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు మరియు బిజెపి ముఖ్య నేతలు మరియు కార్యకర్తల ముందే బిజెపి నేతలు ఒకరినొకరు తిట్టుకున్నారు.





