సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో సరైన శ్మశాన వాటిక లేకపోవడంతో మృతి చెందిన వారి దహన సంస్కార కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. మంగళవారం రజక సంఘం సీనియర్ నాయకులు టెంట్ నర్సింలు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన ప్రజలకు గోస తప్పడం లేదని, దురదృష్టవశాత్తు మరణించిన వారికి దహన సంస్కారాలు చేయడానికి సరైన వసతులు లేక ఉన్న ఆ కాస్త భూమిలో వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదని, అధికారులు వెంటనే ప్రజ్ఞాపూర్ లో సరైన స్మశాన వాటిక ఏర్పాటు కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.





