మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు
– ఎంపీపీ, వెళ్లే రేణుక జడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, పరిశోధనాత్మక రిపోర్టర్/ ఎల్లారెడ్డిపేట:
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు సందర్భంగా వేయి మొక్కలను ప్రజాప్రతినిధులు నాటారు. ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామంలో శనివారం ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు సమక్షంలో పల్లె ప్రకృతి వనం ప్రక్కన వివిధ రకాలైన జామ, వేప,అల్లనేరేడు,సీతాఫలం, దానిమ్మ మొదలగు మొక్కలను నాటారు. అదేవిధంగా మండలంలోని ఆయా గ్రామాలలోని 17వేల మొక్కలను గ్రామ సర్పంచులు, కార్యదర్శుల సమక్షంలో నాటడం జరిగిందని ఎంపీడీవో చిరంజీవి పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్క పెళ్లి గ్రామ సర్పంచ్, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, ఎంపీడీవో చిరంజీవి, ఏపీఓ, వజీర్ అహ్మద్ దళిత ఉద్యమకారుడు అందే సుభాష్, ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, గుల్లపల్లి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
